: కాన్పూర్‌లో భవనం కూలిన ఘటన: మృత్యువును జయించిన మూడేళ్ల పాప‌


నిన్న కాన్పూర్‌ లో నిర్మాణంలో ఉన్న ఏడంతస్తుల భవనం కుప్పకూలిపోయిన విష‌యం తెలిసిందే. ఈ ఘ‌ట‌న‌లో మృతుల సంఖ్య‌ ఆరుకు చేరింది. మ‌రో 30 మంది గాయాల‌పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే, శిథిలాల్లో చిక్కుకున్న ఓ మూడేళ్ల‌ చిన్నారి మృత్యువును జయించింది. శిథిలాల్లో నుంచి పాపను రక్షించిన రెస్క్యూ సిబ్బంది ఆమెను తండ్రికి అందించారు. పాప‌ను చూసిన తల్లిదండ్రులు ఒక్కసారిగా ఉద్వేగానికి లోనయ్యారు. స‌హాయ‌క చ‌ర్య‌లు ఇంకా కొన‌సాగుతున్నాయి. ఆర్మీ, పోలీసులు స‌హాయ‌క చ‌ర్య‌ల్లో పాల్గొంటున్నారు.

  • Loading...

More Telugu News