: నాకు పెద్ద దిక్కు ఎన్టీఆరే: యువ హాస్య నటుడు రఘు


తనకు పెద్ద దిక్కు జూనియర్ ఎన్టీఆరే అని యువ కమెడియన్ రఘు అన్నాడు. మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, జూనియర్ ఎన్టీఆర్ అంటే తనకు వీరాభిమానమని, ఎన్టీఆర్ అనే మూడు అక్షరాలే తనకు, తన కుటుంబానికి అత్యంత విలువైనవని, తన కుటుంబానికి తారక్ పెద్ద దిక్కు అని అన్నాడు. తన సినీ ప్రయాణం అనుకోకుండా మొదలైందని, అది కూడా ‘ఆది’ సినిమాతోనేనని, అప్పటి నుంచి ఇప్పటి వరకు తారక్ తో తన అనుబంధం కొనసాగుతోందని అన్నాడు. జూనియర్ ఎన్టీఆర్ అన్న, నటుడు కల్యాణ్ రామ్ తోనూ తనకు మంచి స్నేహం ఉందని, తారక్ తో బాగా క్లోజ్ గా ఉన్నప్పటికీ, ఆయనతో చెప్పుకోలేని విషయాలను కల్యాణ్ రామ్ తో షేర్ చేసుకుంటానని రఘు చెప్పుకొచ్చాడు.

  • Loading...

More Telugu News