: జైల్లో జగన్ ను కలిసిన టీడీపీ నేత
హైదరాబాద్ చంచల్ గూడ జైలులో రిమాండు ఖైదీగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డిని టీడీపీ నేత మణిగాంధీ కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన, త్వరలోనే జగన్ బయటికి వస్తారన్నారు. మరికొంత మంది నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ లో చేరతారని చెప్పారు. కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నాయని మణిగాంధీ ఆరోపించారు. జగన్ ను కలిసిన సమయంలో అయన వెంట వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు భూపాల్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి ఉన్నారు.