: నడిరోడ్డుపై రక్తపు మడుగులో కుర్రాడు.. ఫొటోలు తీసుకునేందుకు ఎగబడ్డ స్థానికులు!
కర్ణాటకలోని కొప్పం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. మనుషులలో మానవత్వం మంటగలిసిపోతోందని ఆవేదన వ్యక్తం చేస్తూ కవులు రాస్తోన్న కవిత్వాలు నిజమే అనిపించేలా అక్కడి స్థానికులు ప్రవర్తించారు. సైకిల్‌పై వెళుతున్న ఓ కుర్రాడిని బస్సు ఢీ కొట్టి వెళ్లడంతో నడి రోడ్డుపై పడిపోయిన అతనికి తీవ్ర రక్తస్రావం జరిగింది. చుట్టూ మూగిన జనం సినిమా చూసినట్లు ఆ పిల్లాడిని చోద్యం చూశారే తప్పా, ఆసుపత్రికి తీసుకెళ్లలేదు. పైపెచ్చు, అతడి చుట్టూ గూమిగూడిన జనం ఆ కుర్రాడి ఫొటోలు తీసుకునేందుకు ఎగబడ్డారు. బాధతో కొట్టుమిట్టాడుతున్న ఆ కుర్రాడి ఫొటోలను తమ సెల్ ఫోన్ లలో తీస్తూ బిజీ అయిపోయారు. చివరికి ఎంతో ఆలస్యంగా ఆసుపత్రికి తీసుకెళ్లడంతో వైద్యులు అప్పటికే ఆ కుర్రాడు మృతి చెందినట్లు ప్రకటించారు. ఆ కుర్రాడి పేరు అలీ అని, అతనికి సుమారు 15 ఏళ్లు ఉంటాయని వైద్యులు తెలిపారు.