: ఇకపై మరింత సులువుగా శ్రీవారి దర్శన టిక్కెట్లు!


తిరుమల శ్రీవారి దర్శన టిక్కెట్లను ఇకపై మరింత సులువుగా బుక్ చేసుకోవచ్చు. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇప్పటివరకు కేవలం టీటీడీ వెబ్ సైట్ ద్వారా మాత్రమే టిక్కెట్ కొనుగోలు చేసుకునే అవకాశం ఉండేదని, ఇకపై తెలుగు రాష్ట్రాల్లోని ఏటీపీ కేంద్రాల్లో శ్రీవారి దర్శన టిక్కెట్లను అందుబాటులోకి తెస్తున్నామని ఈవో సాంబశివరావు పేర్కొన్నారు. తక్కువ రుసుంతో రూ.300 టిక్కెట్ ను బుక్ చేసుకోవచ్చని, రెండు రాష్ట్రాల్లో సుమారు ఎనిమిది వేల ఆన్ లైన్ సెంటర్లు ఉన్నాయని, వీటితో పాటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో సైతం వారికి శాఖలు ఉన్నాయన్నారు. ఆయా సెంటర్ల ద్వారా టిక్కెట్లను కొనుగోలు చేసుకోవచ్చని పేర్కొన్న సాంబశివరావు, ప్రైవేటు ఇంటర్నెట్ నిర్వాహకులు భక్తుల నుంచి ఎక్కువ సొమ్ము వసూలు చేస్తున్న నేపథ్యంలో వారిని కట్టడి చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

  • Loading...

More Telugu News