: దాసరి ఆత్మస్థైర్యమే ఆయనను కోలుకునేలా చేసింది: మురళీ మోహన్
తీవ్ర అనారోగ్యంతో హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో చేరిన దాసరి నారాయణరావు కోలుకుంటున్నారని సినీనటుడు, ఎంపీ మురళీ మోహన్ అన్నారు. ఈ రోజు ఆయన దాసరిని పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ... ఢిల్లీకి వెళ్లిన తాను అక్కడి నుంచి సరాసరి ఇక్కడికే వచ్చానని చెప్పారు. దాసరికి వెంటిలేటర్ తీసేశారని చెప్పారు. భగవంతుడు ఆయనను చల్లగా చూశారని ఆయన వ్యాఖ్యానించారు. తన గురువు దాసరి ఆత్మస్థైర్యమే ఆయనను కోలుకునేలా చేసిందని అన్నారు. ఆయనకు వైద్యులు మంచి వైద్యం అందిస్తున్నారని, ఆయన కోలుకోవడం ఆనందంగా ఉందని చెప్పారు.