: గ్రీన్ కార్డు దారులు అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదు: వైట్ హౌస్ ప్రకటన

ముస్లిం మెజారిటీ ఉన్న ఏడు దేశాల నుంచి మూణ్నెల్ల పాటు అమెరికాకు ఎవ్వరూ రాకుండా నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అయితే, గ్రీన్ కార్డు ఉన్న ఆ ఏడు దేశాలకు చెందిన వారు అమెరికా నుంచి బయటకు వెళ్లడానికి, తిరిగి అమెరికాకు రావడానికి ఎలాంటి అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదని, వారికి మినహాయింపు ఇస్తున్నామని వైట్ హౌస్ అధికార ప్రతినిధి సీన్ స్పైసర్  తాజాగా ఒక ప్రకటన చేశారు. కాగా, వలసలను, శరణార్థులను అడ్డుకునేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అయితే, గ్రీన్ కార్డు ఉన్నప్పటికీ అమెరికాకు వెళ్లివచ్చే విమానాల్లో వారిని ఎక్కకుండా అడ్డుకున్నారు. దీంతో, ప్రయాణికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో వైట్ హౌస్ తాజా ప్రకటన చేసింది.

More Telugu News