: నిషేధం తరువాత పాకిస్థాన్ లో విడుదలవుతున్న తొలి భారతీయ సినిమా ఇదే!


ఇండియాలో పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రదాదుల నేపథ్యంలో పాక్ నటులను బాలీవుడ్ నిషేధించిన సంగతి విదితమే. దీనికి ప్రతి స్పందనగా వెంటనే పాక్ ఎంటర్ టైన్ మెంట్ ఇండస్ట్రీ కూడా భారతీయ సినిమాలపై నిషేధం విధించింది. పాకిస్థాన్ లో భారతీయ సినిమాలకు అశేషమైన అభిమానులున్నారు. ఒకరకంగా అక్కడ భారతీయ సినిమాలను నిషేధిస్తే సినీ పరిశ్రమే మూతపడిపోతుంది. దీంతో ఎగ్జిబిటర్లు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. ఇప్పుడు ఉద్రిక్తతలు లేవు కనుక తిరిగి ధియేటర్లను ఓపెన్ చేస్తామని తెలిపారు. అంతే కాకుండా సినిమాహాళ్లు మూతపడడం వల్ల కొన్ని వందల కుటుంబాలు తీవ్రంగా నష్టపోతున్నాయని తెలిపారు.  ఈ నేపథ్యంలో పాకిస్థాన్ లో భారతీయ సినిమాలపై నిషేధం ఎత్తివేశారు. దీంతో నిషేధం అనంతరం 'కాబిల్' సినిమా తొలిసారి పాక్ లో విడుదల కానుంది.    

  • Loading...

More Telugu News