: కాపు ఉద్యమానికి మద్దతివ్వండి: శ్రీకాకుళం నేతలతో ముద్రగడ


కాపు రిజర్వేషన్ సాధన సమితి ఉద్యమానికి మద్దతివ్వాని శ్రీకాకుళం నేతలను ముద్రగడ పద్మనాభం కోరారు. శ్రీకాకుళం వెళ్లిన ఆయన స్వాతంత్ర్య సమరయోధుడు గౌతు లచ్చన్న సమాధికి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే గౌతు శివాజీ ఇంటికెళ్లి కాపు ఉద్యమానికి మద్దతివ్వాలని కోరారు. అక్కడి నుంచి న్యాయవాది వడిశ బాలకృష్ణ ఇంటికి వెళ్లారు. అక్కడ వివిధ బీసీ సంఘాల నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తామేమీ గొంతెమ్మ కోరికలు కోరడం లేదని, ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీని నెరవేర్చమంటున్నామని, దానికి ఆయన నియంతలా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ సందర్భంగా కాపు రిజర్వేషన్ ఉద్యమానికి మద్దతివ్వాలని ఆయన వారందర్నీ కోరారు. 

  • Loading...

More Telugu News