: అఖిలేష్ నా కుమారుడు... కూటమి తరపున ప్రచారం చేస్తా: ములాయం యూటర్న్


ఉత్తరప్రదేశ్ లోని సమాజ్ వాదీ పార్టీలో కుటుంబ కలహాలు చల్లారినట్టే కనిపిస్తున్నాయి. సమాజ్ వాదీ అధినేత ములాయం సింగ్ యాదవ్ యూటర్న్ తీసుకున్నారు. గత కొంత కాలంగా అఖిలేష్ యాదవ్ వ్యూహాలన్నీ ఫలిస్తున్నాయి. పార్టీని వ్యూహాత్మకంగా చేజిక్కించుకోవడం దగ్గర్నుంచి, కాంగ్రెస్ పొత్తును తీవ్రంగా వ్యతిరేకించిన ములాయంను సమర్ధవంతంగా ఒప్పించడంలో ఆయన విజయం సాధించారు. ఈ నేపథ్యంలో సమాజ్ వాదీ పార్టీ తరపున ప్రచారంలో పాల్గొంటానని ములాయం ప్రకటించారు. ఎన్ని అనుకున్నా ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తన కుమారుడని ఆయన తెలిపారు. తాను కాంగ్రెస్ తరపున కూడా ప్రచారం చేస్తానని ఆయన ప్రకటించారు. కాగా, గతంలో అఖిలేష్ తోపాటు, పొత్తుపెట్టుకున్న కాంగ్రెస్ తరపున కూడా ప్రచారం చేయనని తెగేసిచెప్పారు. అఖిలేష్ యాదవ్ సర్దిచెప్పిన తరువాత శాంతించిన ఆయన ప్రచారానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 

  • Loading...

More Telugu News