: ప్రతిష్ఠాత్మక ప్రయోగానికి సిద్ధమవుతున్న శ్రీహరికోట.. ఒకేసారి 103 ఉపగ్రహాల ప్రయోగం!
భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం (ఇస్రో) మరో ప్రతిష్ఠాత్మక ప్రయోగానికి సిద్ధమవుతోంది. శ్రీహరి కోటలోని రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి పీఎస్ఎల్వీ సీ-37 రాకెట్ ప్రయోగానికి సర్వం సిద్ధమైంది. ఈ నెల 15న 103 ఉపగ్రహాలతో పీఎస్ఎల్వీ సీ-37 నింగికెగరనుంది. 15న ఉదయం 9.07 నిమిషాలకు రాకెట్ ప్రయోగం నిర్వహిస్తారు. ఈ ప్రయోగానికి ఇప్పటికే సన్నాహాలు పూర్తయ్యాయి.
వివిధ దేశాలకు చెందిన 100 ఉపగ్రహాలతో పాటు భారత్ కు చెందిన మూడు ఉపగ్రహాలు ఈ ప్రయోగంలో నింగికి ఎగరనున్నాయి. ఈ ప్రయోగంపై ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి రేగుతోంది. భారీ ఎత్తున, వివిధ దేశాలకు చెందిన ఉపగ్రహాలు తీసుకెళ్తుండడంతో ప్రయోగంపై ఆసక్తి చూపుతున్నారు. తక్కువ ఖర్చుతో అంతరిక్షంలోకి ఉపగ్రహాలు ప్రవేశపెట్టడంలో ఇస్రోది అందెవేసిన చెయ్యిగా పేరుంది.