: ఐసీయూలో హురియత్ కాన్ఫరెన్స్ చీఫ్ సయ్యద్ అలీ షా జిలానీ
కశ్మీర్ వేర్పాటువాద నేత, హురియత్ కాన్ఫరెన్స్ అధినేత సయ్యద్ అలీ షా జిలానీ అస్వస్థతకు గురయ్యారు. నిన్న రాత్రి ఆయనకు ఛాతీ నొప్పి వచ్చింది. దీంతో ఆయనను ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. జిలానీ వయసు 87 సంవత్సరాలు.