: నీట్ విషయంలో ప్రధాని మోదీ మద్దతు కోరిన శశికళ!


వైద్య విద్య ప్రవేశాలకు ఉద్దేశించిన నీట్ పరీక్ష విషయంలో తమిళనాడుకు మినహాయింపును ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ కోరారు. నీట్ నుంచి తమిళనాడును మినహాయించే విషయంలో తమరి మద్దతును కోరుతున్నామంటూ మోదీకి ఆమె ఓ లేఖ రాశారు. మీరు మద్దతు తెలిపితే... తమిళ ప్రజలు మీకు ఎంతో కృతజ్ఞులై ఉంటారని లేఖలో పేర్కొన్నారు. నీట్ పరీక్ష వల్ల తమిళ విద్యార్థులు నష్టపోయే అవకాశం వుందని ఆమె అన్నారు. ఇదే విషయం గురించి దివంగత ముఖ్యమంత్రి జయలలిత కూడా పట్టుబట్టారన్న విషయాన్ని గుర్తు చేశారు. 

  • Loading...

More Telugu News