: చాహల్ రాటుదేలడానికి కారణం పొట్టి ఫార్మాటే: గంగూలీ

ఒక్క టీ20తో స్టార్ స్పిన్నర్ గా మారిపోయిన యజువేంద్ర చాహల్ పై ప్రశంసల జల్లు కురుస్తోంది. చాహల్ ఆటతీరుపై టీమిండియా దిగ్గజ కెప్టెన్ సౌరవ్ గంగూలీ హర్షం వ్యక్తం చేశాడు. చాహల్ ఐపీఎల్ ప్రోడక్ట్ అని గుర్తుచేశాడు. పొట్టి ఫార్మాట్ గా పేరొందిన టీ20 లీగ్ కు ఐపీఎల్ స్పూర్తి అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదని చెప్పిన గంగూలీ...ఐపీఎల్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడుతున్న చాహల్ ఆ టోర్నీలో రాటుదేలాడని అన్నాడు. ప్రధానంగా టీ20ల్లో ఎప్పుడెలా ఆడాలో బాగా తెలిసిన వాడని అభినందించాడు. కాగా, చాహల్, బుమ్రా ధాటికి ఆరుగురు ఇంగ్లండ్ బ్యాట్స్ మన్ డకౌట్ కాగా, 127 పరుగులకే ఆలౌట్ అయింది.

దీనిపై చాహల్ మాట్లాడుతూ, తాను ఇంత అద్భుతంగా రాణిస్తానని కలలో కూడా ఊహించలేదని అన్నాడు. కోహ్లీ నమ్మకమే నాణ్యమైన బంతులేసేందుకు తోడ్పడిందని, పిచ్ కూడా తనకు సహకరించిందని చాహల్ చెప్పాడు. ఈ ఫీట్ తన కెరీర్ లో టాప్ పెర్ఫార్మెన్స్ గా ఉంటుందని అభిప్రాయపడ్డాడు. కాగా, నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసిన చాహల్ 25 పరుగులిచ్చి 6 వికెట్లు తీశాడు. ఈ ఫీట్ సాధించిన తొలి ఇండియన్ క్రికెటర్ గా నిలవగా, ఈ ఫీట్ సాధించిన రెండో టీ20 బౌలర్ గా నిలిచాడు.

More Telugu News