: జైట్లీ బడ్జెట్ పై పన్నీర్ సెల్వం స్పందన


2017-18 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్ పై తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం స్పందించారు. ఈ బడ్జెట్ ముందుచూపుతో కూడుకున్నదని ఆయన కితాబిచ్చారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని బడ్జెట్ ను రూపొందించారని అన్నారు. దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న కోటి కుటుంబాలను ఆదుకునే దిశగా ప్రవేశపెట్టిన 'మిషన్ అంత్యోదయ' పథకాన్ని పన్నీర్ సెల్వం అభినందించారు. రాష్ట్రాలలోని పేదరికాన్ని నిర్మూలించేందుకు ఈ పథకం ఉపయోగపడుతుందని చెప్పారు. ఉపాధిహామీ పథకం, ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన, జాతీయ గ్రామీణ జీవన మెరుగుదల పథకాలకు నిధులను పెంచడాన్ని ఆయన స్వాగతించారు. అయితే, తమిళనాడు వంటి రాష్ట్రాల్లోని విద్యార్థులపై జాతీయ స్థాయిలో నిర్వహించే 'నీట్' లాంటి పరీక్షలను బలవంతంగా రుద్దడాన్ని మాత్రం ఆయన తప్పుబట్టారు.  

  • Loading...

More Telugu News