: శ్రీనివాస్ రెడ్డిని అభినందిస్తూ పుష్పగుచ్ఛం పంపిన పవన్ కల్యాణ్


తాను నటించిన సినిమాలే ఇప్పటికీ కొన్ని చూడలేదని చెప్పుకునే జనసేన అధినేత, ప్రముఖ సినీ నటుడు పవన్ కల్యాణ్ ఇతర హీరోకి చెందిన సినిమాను చూశారు. నమ్మశక్యం కాకున్నా ఇది నిజం. శ్రీనివాస్ రెడ్డి నటించిన 'జయమ్ము నిశ్చయమ్మురా' సినిమాను పవన్ చూశారు. సినిమాలో నటించిన వారిని, యూనిట్ సభ్యులను ఆయన మెచ్చుకున్నారు. అంతేకాదు, శ్రీనివాస్ రెడ్డిని అభినందిస్తూ, ఓ పుష్పగుచ్ఛాన్ని కూడా పంపారు. "మంచి సినిమా చేశావు. సినిమాను చాలా ఎంజాయ్ చేశా. నీకు బెస్ట్ విషెస్" అంటూ ఫ్లవర్ బొకే పంపారు. పవన్ తన సినిమాను చూసి, ఫ్లవర్ బొకే పంపడంతో శ్రీనివాస్ రెడ్డి ఉబ్బితబ్బిబ్బయ్యాడు. పవన్ కు థ్యాంక్స్ చెబుతూ ట్వీట్ చేశాడు

  • Loading...

More Telugu News