: ఆరేళ్ల పిల్లాడిని గాయపరిచిన రైనా సిక్సర్.. బాధతో విలవిల్లాడిన చిన్నారి!


బెంగళూరులో ఇంగ్లండ్ తో జరిగిన చివరి టీ20 మ్యాచ్ లో టీమిండియా బ్యాట్స్ మెన్ సురేష్ రైనా చెలరేగిపోయిన సంగతి తెలిసిందే. 45 బంతులను ఎదుర్కొన్న రైనా ఐదు సిక్సర్లు, రెండు ఫోర్ల సాయంతో 63 పరుగులు చేశాడు. టాప్ స్కోరర్ గా నిలిచిన రైనా... 140 స్ట్రయిక్ రేటుతో రెచ్చిపోయాడు. ఈ క్రమంలో రైనా కొట్టిన ఓ సిక్సర్ స్టేడియంలో కూర్చున్న ఆరేళ్ల కుర్రాడికి తగిలింది. సరిగ్గా తొడమీద బంతి పడటంతో, ఆ పిల్లాడు విలవిల్లాడిపోయాడు. వెంటనే ఆ చిన్నారిని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స అందించి, ఆ తర్వాత డిశ్చార్జి చేశారు. 

  • Loading...

More Telugu News