: లాఠీచార్జ్ లో తీవ్రంగా గాయపడ్డ కేరళ రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు
కేరళలోని తిరువనంతపురంలో ఓ న్యాయ కళాశాల యాజమాన్యానికి వ్యతిరేకంగా బీజేపీ నిర్వహించిన నిరసన కార్యక్రమం హింసాత్మక రూపం దాల్చింది. దీంతో, పోలీసులు నిరసనకారులపై లాఠీచార్జ్ చేశారు. ఈ క్రమంలో పలువురు బీజేపీ కార్యకర్తలు, పోలీసులు, జర్నలిస్టులు గాయపడ్డారు. పరిస్థితి చేయిదాటి పోతుండటంతో, పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు. ఈ క్రమంలో, ఓ షెల్ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పీపీ వావా తల మీద తగిలింది. దీంతో, ఆయన తీవ్రంగా గాయపడ్డారు.