: సైకిల్ కొట్టేశారట... సరాసరి పోలీస్ స్టేషన్ కెళ్లి ఫిర్యాదు చేసిన బాలుడు!


విద్యార్థుల్లో అవగాహన ఏ స్ధాయిలో ఉందో నిరూపించే ఘటన హైదరాబాదులోని ఎస్సార్ నగర్ లో చోటుచేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే... ఎస్సార్ నగర్ లోని ఎస్సార్టీ కాలనీకి చెందిన మోహన్‌ స్థానిక పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. కరెంటు బిల్లు కట్టేందుకు ఈ కుర్రాడు అమీర్‌ పేట సోనాబాయి దేవాలయం సమీపంలో ఉన్న మీసేవా కేంద్రానికి తన సైకిల్‌ పై వెళ్లి, బిల్లు చెల్లించి తిరిగి సైకిల్ వద్దకు చేరుకోగా, తాను పెట్టిన చోట సైకిల్ కనపడలేదు. చుట్టుపక్కల సైకిల్ గురించి గాలించాడు. ఎక్కడా కనిపించలేదు.

దీంతో దగ్గర్లో ఓ సీసీ కెమెరా ఉండడంతో, వెళ్లి వారిని ఆరాతీయగా, సీసీ కెమెరాలో సైకిల్ ను ఒక వ్యక్తి తీసుకెళ్తున్నట్టు కనిపించింది. అంతే, నేరుగా ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. ఒకటో తరగతి నుంచి కుటుంబ సభ్యులు ఇచ్చిన పాకెట్ మనీ దాచుకుని, అలా 7,500 రూపాయలు పోగేసి ఆ సైకిల్ కొనుక్కున్నానని, తన సైకిల్ తనకు కావాలని ఫిర్యాదు చేశాడు. దీంతో బాలుడి అవగాహనకు పోలీసులు ఆశ్చర్యపోయారు. సైకిల్ ను గాలిస్తామని చెప్పి పంపారు. 

  • Loading...

More Telugu News