: ఖరారైన మోదీ ఇజ్రాయెల్ పర్యటన


ప్రధాని నరేంద్ర మోదీ ఇజ్రాయెల్  పర్యటన ఖరారైంది. రానున్న జూన్‌ లేదా జులైలో ఆయన ఇజ్రాయెల్ లో పర్యటించనున్నారు. ఈ మేరకు ఇజ్రాయెల్ లోని భారత రాయబారి పవన్ కపూర్ ప్రకటన చేశారు. తేదీలు ఖరారు కావాల్సి ఉందని తెలిపిన ఆయన, తొలిసారి ఇజ్రాయెల్ పర్యటనకు భారత్ ప్రధాని రానున్నారని చెప్పారు. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య రక్షణ రంగ సహకారం పెంపొందడంతో పాటు, మేకిన్ ఇండియాలో భాగంగా, కీలక యూనిట్లను భారత్ లో తయారు చేసే అంశాలను పరిశీలించనున్నారని, ఈ మేరకు ఆశావహ చర్చలు జరగనున్నాయని తెలిపారు.  

  • Loading...

More Telugu News