: దాసరి ఆరోగ్యం నిలకడగా ఉంది: కిమ్స్ ఎండీ
టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని కిమ్స్ ఆసుపత్రి ఎండీ సీఈవో డాక్టర్ బొల్లినేని భాస్కర్ రావు తెలిపారు. శస్త్రచికిత్స చేసిన అనంతరం ఆయనకు డయాలసిస్ చేయాల్సిన అవసరం రాలేదని ఆయన తెలిపారు. దీనిపై ప్రముఖ నటుడు, నిర్మాత మోహన్ బాబు మాట్లాడుతూ, దాసరికి నిపుణుల బృందం శస్త్రచికిత్స నిర్వహించిందని, ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని అన్నారని తెలిపారు. దాసరి త్వరగా కోలుకోవాలని బాబాను వేడుకునేందుకు తాను షిర్డీ వెళ్తున్నానని ఆయన తెలిపారు. దాసరిని పరామర్శించేందుకు టాలీవుడ్, రాజకీయ ప్రముఖులు ఆసుపత్రికి తరలివస్తున్నారు.