: డొనాల్డ్ ట్రంప్ తో బాలీవుడ్ నటి బ్రేక్ ఫాస్ట్


అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తో బాలీవుడ్‌ బ్యూటీ బ్రేక్ ఫాస్ట్ చేయబోతోంది. యునైటెడ్‌ స్టేట్స్‌ కాంగ్రెస్‌ సభ్యులు ఫెల్లోషిప్‌ ఫౌండేషన్‌ అనే క్రైస్తవ ఆర్గనైజేషన్‌ తరఫున ‘నేషనల్‌ ప్రేయర్‌ బ్రేక్‌ ఫాస్ట్‌’ అనే కార్యక్రమాన్ని 1953 నుంచి అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి సుమారు 3,500 మంది అతిథులు హాజరుకానున్నారు. అంతటి ప్రత్యేకత కలిగిన కార్యక్రమంలో బాలీవుడ్ బ్యూటీ ఎవ్లిన్‌ శర్మ పాల్గొనబోతోంది. జర్మనీకి చెందిన ఎవ్లిన్‌ శర్మ బాలీవుడ్‌ లో సల్మాన్ నిర్మాతగా మారి తెరకెక్కించిన 'మై తేరా హీరో', 'యే జవానీ హై దివానీ' సినిమాల్లో నటించింది. ప్రస్తుతం లాస్‌ఏంజెల్స్‌ లో సెలవులు ఎంజాయ్‌ చేస్తోన్న ఎవ్లిన్ శర్మ బ్రేక్‌ ఫాస్ట్‌ కార్యక్రమం కోసం లాస్‌ ఏంజెల్స్‌ నుంచి వాషింగ్టన్‌ కి వెళ్లనుంది. 

  • Loading...

More Telugu News