: అరటి పండ్ల మధ్య సౌదీ కరెన్సీ.. ఇద్దరి అరెస్టు!


అరటి పండ్లలో సౌదీ కరెన్సీని దాచి పెట్టి, వాటిని అక్రమంగా తరలించేందుకు యత్నించిన ఇద్దరు ప్రయాణికులను కేరళలోని కోజికోడ్ విమానాశ్రయంలో అరెస్టు చేశారు. కోజికోడ్ విమానాశ్రయం నుంచి దుబాయ్ కు వెళుతున్న ఇద్దరు ప్రయాణికులు తమ లగేజీలో అరటిపండ్ల మధ్య కరెన్సీ వుంచి పట్టుకెళ్లారు. ఈ విధంగా చేస్తే ఎవరికీ అనుమానం రాదని వారు భావించారు. అయితే, అధికారుల తనిఖీల్లో ఈ విషయం బయటపడటంతో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు మాట్లాడుతూ, అరటి పండ్లలో గుజ్జును తొలగించి, వాటి స్థానంలో సౌదీ కరెన్సీని ఉంచారన్నారు. మన కరెన్సీ ప్రకారం వాటి విలువ సుమారు రూ. 46 లక్షల వరకు ఉంటుందని చెప్పారు. 

  • Loading...

More Telugu News