: కోహ్లీ అవుట్... టీమిండియా 67/2


బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతున్న చివరి టీ20 మ్యాచ్ లో టీమిండియా ధాటిగా ఇన్నింగ్స్ ప్రారంభించింది. కెప్టెన్ కోహ్లీ, కేఎల్ రాహుల్ జాగ్రత్తగా ఆడుతూ ఇన్నింగ్స్ నిర్మించే ప్రయత్నం చేశారు. ఊహించని విధంగా సమన్వయ లోపంతో కోహ్లీ రనౌట్ గా పెవిలియన్ చేరాడు. అనంతరం వచ్చిన రైనా వస్తూనే ధాటిగా ఆడసాగాడు. ఈ క్రమంలో రెండు సిక్సర్లు బాదాడు. రైనా స్పూర్తితో రాహుల్ బంతిని స్టేడియం బయటకు షాట్ కొట్టాడు. దీంతో బంతి మార్చాల్సి వచ్చింది. కొత్త బంతితో బౌలింగ్ చేసిన బెన్ స్టోక్స్ రాహుల్ ను అవుట్ చేశాడు. దీంతో రైనా (35)కి జతగా ధోనీ (1) దిగాడు. 8 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా రెండు వికెట్ల నష్టానికి 67 పరుగులు చేసింది. 

  • Loading...

More Telugu News