: రజనీకాంత్ పై ప్రశంసల జల్లు కురిపించిన బ్రిటిష్ భామ అమీజాక్సన్
సూపర్‌స్టార్ రజనీకాంత్, బ్రిటిష్ భామ అమీజాక్సన్ జంటగా 'రోబో 2.0' సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈ క్రమంలో, అమీజాక్సన్ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రజనీకాంత్‌పై ప్రశంసల వర్షం కురిపించింది. చెన్నయ్‌లో అడుగుపెడితే అంతా రజనీకాంతే కనిపిస్తారని ఆమె వ్యాఖ్యానించింది. రజనీని సూపర్ హ్యూమన్ అనుకోవడం కరెక్ట్ అని పేర్కొంది. ఆయన ఒక మంచి నటుడే కాకుండా దయకలిగిన వ్యక్తని ఆమె కొనియాడింది. ఆయన విజయాన్ని మనం లెక్కకట్టలేమని పేర్కొంది. రజనీతో ఓ చిన్న సంభాషణ జరిపితే చాలు... జీవితంలో కృతజ్ఞతాభావానికి ఉన్న విలువ ఏంటో తెలుస్తుందని ఆమె వ్యాఖ్యానించింది. ఆయన ముందు నటించడం కష్టమేనని అంది. ఆయన ఎవరినీ భయపెట్టే వ్యక్తి కారని, శ్రద్ధ తీసుకుని చెప్పే వ్యక్తి అని చెప్పింది.