: రేపు ప్రొ.కోదండరాం అధ్యక్షతన టీజేఏసీ కీలక భేటీ
తెలంగాణ ప్రభుత్వ విధానాలపై గళం విప్పుతున్న ప్రొ.కోదండరాం అధ్యక్షతన రేపు తెలంగాణ జేఏసీ స్టీరింగ్ కమిటీ కీలక సమావేశం జరగనుంది. రేపు ఉదయం 11 గంటలకు హైదరాబాదు, నాంపల్లిలోని కేంద్ర కార్యాలయంలో ప్రారంభం కానున్న ఈ భేటీలో ప్రధానంగా ఈ నెల చివర్లో నిర్వహించాలనుకుంటున్న నిరుద్యోగ నిరసన ర్యాలీ తేదీని నిర్ణయిస్తారు. తమ ర్యాలీని విజయవంతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. ఈ భేటీలో టీజేఏసీ రాష్ట్రస్థాయి సభ్యులతో పాటు ప్రాంతీయ సమన్వయకర్తలు కూడా పాల్గొంటారు. తమ నాయకులను సమాచార సేకరణ పేరుతో ఇంటెలిజెన్స్ పోలీసులు వేధిస్తున్న ఘటనలపై కూడా ఈ భేటీలో ప్రస్తావించనున్నారు. అనంతరం కోదండరాం మీడియాతో మాట్లాడతారు.