: వాళ్ల నాన్న బాగా రిచ్... ఆమెకు టెన్షన్ ఎందుకంటున్న బాలీవుడ్ విలన్!
బాలీవుడ్ యువనటి శ్రద్ధా కపూర్ పై స్టార్ విలన్, ఆమె తండ్రి శక్తి కపూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆమె తనలా తీవ్రంగా కష్టపడాల్సిన అవసరం లేదని అన్నాడు. అలాగే రిస్క్ లు చేయాల్సిన అవసరం కూడా లేదని పేర్కొన్నాడు. సినిమాల మధ్య గ్యాప్ వచ్చినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఎందుకంటే వాళ్ల నాన్న చాలా రిచ్ అని చెప్పాడు. ఆమె కోరుకుంటే ప్రపంచం ఆమె కాళ్ల ముందు ఉంటుందని, దేనికీ ఆమె ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నాడు.
దేనినైనా ఆమె తేలిగ్గా తీసుకోవచ్చని తెలిపాడు. బాలీవుడ్ లో ఎన్నో సినిమాల్లో విలన్, కమేడియన్ గా నటించిన శక్తి కపూర్ హీరోలతో సమానమైన స్టార్ డమ్ సంపాదించుకున్నాడు. కాగా, అతని కుమార్తె శ్రద్ధా కపూర్ కూడా 'ఆషికీ 2', 'భాగీ', 'ఏక్ విలన్', 'హైదర్', 'ఓకే జాను' వంటి సినిమాలతో సత్తాచాటి ప్రేక్షకులను అలరిస్తోంది. ఆమె కెరీర్ గురించి మాట్లాడుతూ శక్తి కపూర్ పై వ్యాఖ్యలు చేశాడు.