: ఒకరి ప్రాణం తీసిన నాలుగు 'చిల్లర' గొడవ!
హైదరాబాద్ శివారులోని హయత్‌నగర్‌లో దారుణ ఘటన జరిగింది. నాలుగు రూపాయల చిల్లర కోసం ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ రాజుకొని ఒకరి మృతికి కారణమైంది. వివరాలు చూస్తే... వర్డ్ అండ్ డీడ్ పాఠశాల సమీపంలోని పాన్‌షాపు వద్దకు వచ్చిన రాజేష్ అనే వ్యక్తి అక్కడ సిగరెట్ కొని, కాల్చాడు. రాజేష్‌కి పాన్ షాపు నడుపుతున్న వ్యక్తి నాలుగు రూపాయల చిల్లర తిరిగి ఇవ్వాల్సి వచ్చింది. దీంతో వారిద్దరి మధ్య వివాదం చెలరేగడంతో, షాపు యాజమాని, అతని స్నేహితులు కలిసి రాజేష్‌పై దాడిచేశారు.
రాజేష్‌ని వారు చితక్కొడుతుండడంతో ఆ దెబ్బలు తాళలేక రాజేష్ రోడ్డుమీదకు పరుగుతీశాడు. అయితే, ఆయన రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన ఓ లారీ అతడిని ఢీకొట్టింది. దీంతో ఆయన ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు సీసీఫుటేజీ ఆధారంగా కేసు నమోదు చేసుకుని, ఘటనకు కారణమైన ఐదుగురిని అరెస్టు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.