: ఢిల్లీ నుంచి విశాఖకు రావాల్సిన విమానానికి తప్పిన ప్రమాదం!


ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇండిగో విమానానికి పెద్ద ప్రమాదం తప్పింది. ఢిల్లీ నుంచి విశాఖపట్టణం వెళ్లాల్సిన ఇండిగో విమానం 6ఈ 719కు 28వ రన్ వే కేటాయించారు. ‘సి’ లేన్ ద్వారా ఆ విమానం రన్ వే పైకి రావాల్సి ఉంది. అయితే, రన్ వేను దాటి డబ్ల్యూ లేన్ లోకి వెళ్లిపోయిన విషయాన్ని కమాండర్ గుర్తించారు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ కూడా అప్రమత్తం చేయడంతో ఆ విమానాన్ని కమాండర్ నిలిపివేశాడు. అప్పటికే అదే మార్గంలో జెట్ ఎయిర్ వేస్ విమానం ఒకటి నిలిచి ఉండటం గమనార్హం. అయితే, మంచు కారణంగా సరిగా కనిపించకపోవడంతోనే ఈ తప్పిదం జరిగిందని సదరు విమానం కమాండర్ చెబుతున్నాడు. ఈ విషయమై రెగ్యులేటర్ డైరెక్టర్ జనరల్ దర్యాప్తునకు ఆదేశించారు. ఈ సంఘటన కారణంగా పలు విమానాలు సుమారు గంటపాటు ఆలస్యం కాగా, మరికొన్నింటిని దారి మళ్లించారు.

  • Loading...

More Telugu News