: దాసరిని మరో 24 గంటల పాటు అబ్జర్వేషన్ లో ఉంచుతున్నాం: కిమ్స్ హాస్పిటల్ సీఈవో
ప్రముఖ సినీ దర్శకుడు, కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావు ఆరోగ్యం మెరుగు పడుతోందని కిమ్స్ హాస్పిటల్ సీఈవో బొల్లినేని భాస్కర్ రావు తెలిపారు. ఈ రోజు ఆయనకు డయాలసిస్ చేయాల్సిన అవసరం లేదని చెప్పారు. అయితే, మరో 24 గంటల పాటు ఆయనను అబ్జర్వేషన్ లో ఉంచుతున్నామని వెల్లడించారు. దాసరి ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు.