: అమరావతికి ఏపీ అసెంబ్లీ సెక్రటేరియట్.. సర్క్యులర్ జారీ!


ఇప్పటివరకు హైదరాబాదులో ఉన్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సెక్రటేరియట్ ఇకపై అమరావతి నుంచి పనిచేస్తుంది. ఈ నెల మూడో వారంలో ఏపీ అసెంబ్లీ సెక్రటేరియట్ ను అక్కడికి తరలిస్తున్నట్టు అసెంబ్లీ సెక్రటరీ సర్క్యులర్ జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఏపీ అసెంబ్లీ భవనాల నిర్మాణం శరవేగంగా జరుగుతోందని ఆ సర్క్యులర్ లో పేర్కొన్నారు. కాగా, త్వరలో జరగాల్సిన అసెంబ్లీ సమావేశాలను అమరావతిలో నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోందని, ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ సెక్రటేరియట్ ను అమరావతికి షిఫ్ట్ చేస్తున్నామని అధికారులు స్పష్టం చేశారు. 

  • Loading...

More Telugu News