: బడ్జెట్ ప్రసంగం వేళ.. జైట్లీ ‘కవిత’లు సాగాయి ఇలా!


కేంద్ర బడ్జెట్ గురించి ప్రసంగించే సమయంలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మధ్య మధ్యలో కవితలు చదువుతూ అధికార పక్షం సహా విపక్ష సభ్యులను ఆకట్టుకున్నారు. ముఖ్యంగా నల్లధనం, నోట్ల రద్దు, నగదు రహిత దేశంగా భారత్ ను మార్చాలనుకోవడం, నోట్ల రద్దును ప్రతిపక్షాలు వ్యతిరేకించడం వంటి అంశాల గురించి జైట్లీ ప్రస్తావించిన సందర్భంలో ‘కవిత’లు చదివారు.

 * నగదు రహిత దేశంగా మార్చాలనుకుంటున్న తమ ప్రభుత్వ విధానాన్ని తెలియజెబుతూ.. ఇస్ మోడ్ పర్ న గబ్రా కర్ థమ్ జాయె ఆప్, జో బాత్ నయీ హై ఉసే అప్నాయే ఆప్ అన్నారు. అంటే.. ఈ తరుణంలో భయపడి ఇక్కడే ఆగిపోకండి, ఆ కొత్త విషయాన్ని ఆకళింపు చేసుకోవాలి.
* నోట్ల రద్దు గురించి ప్రస్తావిస్తూ... నయీ దునియా హై, నయా దౌర్ హై, నయీ హై ఉంగ్, కుచ్ థె పెహ్లె కె తరీకె, తొ కుచ్ హై ఆజ్ కె రంగ్ దంగ్ అని చెప్పారు. ఇది కొత్త ప్రపంచం, కొత్త ఉత్సాహం, కొన్ని గతంలో లానే ఉన్నాయి..కొన్ని కొత్తగా ఉన్నాయని అర్థం.
* నల్లధనం గురించి మాట్లాడుతూ.. రోషినీ జో యె నికల్ ఆయి హై, కాలె ధన్ కో భి బదల్నా పడా అప్నా రంగ్ అంటే..నల్లధనం కూడా తన రంగు మార్చుకునేలా చేసిందీ కొత్త కాంతి అని జైట్లీ చదివిన కవితకు అర్థం.

  • Loading...

More Telugu News