: లోక్ సభ నుంచి వాకౌట్ చేసిన వైకాపా ఎంపీలు
లోక్ సభ నుంచి వైకాపా ఎంపీలు వాకౌట్ చేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశ పెట్టిన బడ్జెట్లో ఏపీకి ప్రత్యేక హోదా, రైల్వే జోన్ లు లేకపోవడంతో నిరసన వ్యక్తం చేస్తూ వీరు సభ నుంచి బయటకు వచ్చారు. అనంతరం వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పార్లమెంటు మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ, ఏపీ ప్రజల ఆశలపై కేంద్ర ప్రభుత్వం నీళ్లు చల్లిందని విమర్శించారు. కేపిటల్ గెయిన్స్ పన్ను రద్దు చేయడం వల్ల అమరావతికి భూములు ఇచ్చిన రైతులకు ఒరిగేది ఏమీ లేదని అన్నారు. అయితే, జైట్లీ బడ్జెట్ ప్రసంగం ముగిసిన వెంటనే లోక్ సభను స్పీకర్ సుమిత్రా మహాజన్ వాయిదా వేశారు. దీంతో, వైకాపా సభ్యులు వాకౌట్ చేసిన అంశానికి పెద్దగా ప్రాధాన్యత లేకపోయింది.