: తెలుగు ప్రజలను నిరాశపరిచిన కేంద్ర బడ్జెట్: వైఎస్సార్సీపీ నేత పార్థసారథి


కేంద్ర ప్రభుత్వం 2017-18 ఏడాదికి గాను ప్రవేశపెట్టిన బడ్జెట్ పై వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి పార్థసారథి విమర్శలు గుప్పించారు. తెలుగు ప్రజలను నిరాశపరిచే విధంగా ఈ బడ్జెట్ ఉందని, ఏపీని పట్టించుకోవాలనే ఉద్దేశం ఎన్డీయే ప్రభుత్వానికి ఏకోశాన లేదని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా, రైల్వేజోన్, అమరావతి కనెక్టవిటీ గురించి ఈ బడ్జెట్ లో ప్రస్తావించలేదని,  సీఎం చంద్రబాబు ఇప్పటికైనా పట్టించుకోవాలని కోరారు. రాష్ట్ర విభజన వల్ల నష్టపోయిన ఏపీని ఈ బడ్జెట్ తీవ్రంగా నిరాశపరిచిందని పార్థసారథి మండిపడ్డారు.

  • Loading...

More Telugu News