: తొలి వారంలోనే 200 కోట్లు వసూలు చేసిన 'రయీస్'
గుజరాత్ కు చెందిన గ్యాంగ్ స్టర్ జీవిత గాథ ఆధారంగా రూపొందిన బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ 'రయీస్' సినిమా కలెక్షన్ల వేటలో దూసుకుపోతోంది. గత నెల 25న విడుదలైన ఈ సినిమా తొలివారం ముగిసేసరికి 200 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. ఓవర్సీస్ లో 62.56 కోట్ల రూపాయలు రాగా, భారత్ లో 152.61 కోట్ల రూపాయల వసూళ్లు సాధించిందని ట్రేడ్ అనలిస్టులు చెబుతున్నారు. రాహుల్ ఢొలాకియా దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను నిర్మించింది కూడా షారూఖ్ ఖాన్ కు చెందిన 'రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్ మెంట్స్' సంస్థ కావడం విశేషం. కాగా, అదే రోజు విడుదలైన 'కాబిల్' సినిమా విమర్శకుల ప్రశంసలు పొందినప్పటికీ కలెక్షన్ల రేసులో 'రయీస్' కంటే వెనుకబడింది.