: అభిమాని తల్లికి శుభాకాంక్షలు తెలిపిన సెహ్వాగ్
టీమిండియా డాషింగ్ మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ట్విట్టర్ కింగ్ గా మారిన సంగతి తెలిసిందే. ప్రధానంగా క్రీడలపై స్పందించే సెహ్వాగ్ క్రికెటర్ గా కంటే ట్విట్టర్ వ్యాఖ్యలతో ఎక్కువ పాప్యులారిటీ సొంతం చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో ట్విట్టర్ లో సెహ్వాగ్ ను అనుసరించే ఓ అభిమాని తన తల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాలని సెహ్వాగ్ ను కోరాడు. దీనికి స్పందించిన సెహ్వాగ్ ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ, 'నువ్వు అమ్మకు ఆనందాన్నివ్వు .. అమ్మ నీకు జ్ఞానం పంచుతారు' అంటూ ట్వీట్ చేశాడు. దీంతో అభిమాని ఆనంద్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తన తల్లి సెహ్వాగ్ ట్వీట్ చూసి చాలా సంతోషించిందని, తనకు మాటలు రావడం లేదని సెహ్వాగ్ కు ట్విట్టర్ లో ధన్యవాదాలు తెలిపాడు.