: ప్రజల అదృష్టం.. తెలంగాణకు సీఎంగా కేసీఆర్ దొరికారు!: చినజీయర్ స్వామి


తెలంగాణ ముఖ్యమంత్రి  కేసీఆర్ పై చినజీయర్ స్వామి మరోసారి ప్రశంసల జల్లు కురిపించారు. రాష్ట్ర ప్రజలకు సీఎంగా కేసీఆర్ దొరకడం అదృష్టమని ఆయన వ్యాఖ్యానించారు. ఈ రోజు ఆయ‌న‌ భద్రాచలం రాములవారిని దర్శనం చేసుకున్న అనంతరం భద్రాద్రి అభివృద్ధి కోసం జరిగిన సమావేశంలో పాల్గొని మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కేసీఆర్ వల్లే దేవాలయాలకు స్వర్ణయుగం వ‌స్తుంద‌ని అన్నారు. కేసీఆర్ కోరిక మేరకు భద్రాచలం ఆలయంతో పాటు ప్రాంగణంలో ఆగమశాస్త్రం ప్రకారం మార్పులు సూచించామని చినజీయర్ స్వామి పేర్కొన్నారు. ఇటీవల హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో తన షష్ట్యబ్ది ఉత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో కూడా చినజీయర్ స్వామి కేసీఆర్ పై ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News