: బాణసంచా పేలుళ్లు ఊహించాం.. కానీ తుస్సుమనిపించారు: రాహుల్ గాంధీ
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్ పై కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శలు కురిపించారు. బడ్జెట్ లో బాణసంచా పేలుళ్లు ఉంటాయేమోనని తాము ఊహించామని... కానీ, తుస్సుమనిపించారని ఎద్దేవా చేశారు. రైతులకు మేలు చేసే ఎలాంటి కేటాయింపులు లేవని విమర్శించారు. పెద్ద నోట్లను రద్దు చేసిన నేపథ్యంలో, రైతులకు వరాలు కురిపిస్తారని భావించామని... కానీ అదేమీ జరగలేదని అన్నారు. జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్ రాబోయే ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపబోదని అన్నారు. ప్రజలకు ఉపయోగపడే ఒక్క అంశం కూడా బడ్జెట్ లో లేదని తెలిపారు. అయితే, రాజకీయ విరాళాలపై విధించిన ఆంక్షలను మాత్రం తాము స్వాగతిస్తున్నామని చెప్పారు.