: అవినీతి అధికారులకు బుద్ధి చెబుతూ.. గతంలో మురికినీరు తాగించారు.. ఇప్పుడు కరెన్సీ నోట్లను తినిపించారు!


లంచ‌గొండి అధికారుల‌కు బుద్ధి చెప్ప‌డానికి అహ్మ‌దాబాద్‌లోని లోక్‌ర‌క్ష‌క్ సేవా స‌మితి కార్య‌క‌ర్త‌లు న‌డుం బిగించారు. గతంలో అవితీపరుడైన ఓ మునిసిపల్‌ అధికారితో మురికినీటిని తాగించిన స‌ద‌రు కార్య‌క‌ర్త‌లు తాజాగా, ఓ అవినీతి అధికారితో  
బలవంతంగా కరెన్సీ నోట్లను తినిపించారు. త‌మ‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ వెస్ట్‌జోన్‌ పన్ను విభాగంలో అసిస్టెంట్‌ మేనేజర్‌గా పనిచేస్తున్న ధర్మీన్‌ వ్యాస్‌ అవినీతికి పాల్పడుతున్నాడని తెలుసుకున్న స‌ద‌రు ఎన్జీవో కార్యకర్తలు 30 మంది ఆయ‌న కార్యాల‌యానికి మీడియాతో క‌లిసి వెళ్లారు.

త‌మ‌తో తెచ్చుకున్న క‌రెన్సీ నోట్లకు పచ్చడి పూసి వాటిని తినాలని వ్యాస్‌కు చెప్పారు. అయితే, స‌ద‌రు అధికారి ఒప్పుకోక‌పోవ‌డంతో ఆయ‌న‌ నోటిని బలవంతంగా తెరిచి నోటిలో ఆ నోట్లను కుక్కారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన దృశ్యాలు అక్క‌డి టీవీ చానళ్లలో ప్రసారం చేశారు. అయితే, ఆ అధికారి అనంత‌రం త‌న‌పై దాడి చేసిన వారిపై పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. దీంతో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసుకున్న పోలీసులు ఎన్జీఓ చీఫ్‌ పృథ్వీభట్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. తాను ఏ తప్పూ చేయలేదని పృథ్వీ  పోలీసులతో చెప్పారు.

  • Loading...

More Telugu News