: కేంద్ర బడ్జెట్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు!
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ 2017-18 ఆర్థిక సంవత్సరానికి గాను ఈ రోజు బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా, బడ్జెట్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను గుర్తు చేసుకుందాం.
- మొరార్జీ దేశాయ్ అత్యధికంగా 10 సార్లు కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. 1964, 1968 సంవత్సరాల్లో ఆయన జన్మదినం రోజునే బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఆ తర్వాత ఆయన ప్రధానిగా కూడా బాధ్యతలను నిర్వర్తించారు.
- సాధారణంగా సాయంత్రం 5 గంటలకు బడ్జెట్ ను ప్రవేశపెట్టే సంప్రదాయం ఉండేది. అటల్ బిహారీ వాజ్ పేయి హయాంలో ఈ సమయాన్ని ఉదయం 11 గంటలకు మార్చారు.
- భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు అతిపెద్ద బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఆర్థిక విధానాల్లో తీసుకున్న మార్పులన్నింటినీ ఆ బడ్జెట్ లో పొందుపరిచారు.
- ప్రస్తుత బడ్జెట్ లో రైల్వే బడ్జెట్ ను కూడా సాధారణ బడ్జెట్ లో చేర్చారు. 92 ఏళ్లుగా వస్తున్న సంప్రదాయానికి ఫుల్ స్టాప్ పెట్టారు.
- సంప్రదాయానికి విరుద్ధంగా ఈసారి కేంద్ర బడ్జెట్ ను నెల ముందే ప్రవేశపెట్టారు.
- ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రధాన మంత్రులు జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీలు ప్రధానులుగా బడ్జెట్ ప్రవేశపెట్టారు.
- మొట్టమొదటి బడ్జెట్ ను 1860లో ప్రవేశపెట్టారు. ఇండియన్ కౌన్సిల్ లో ఆర్థిక మంత్రిగా పని చేసిన విల్సన్ ఆ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.