: విపక్షాలు అడ్డుపడుతున్నా పట్టించుకోని కేంద్రం... లోక్ సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన జైట్లీ


సీనియర్ పార్లమెంటేరియన్ అహ్మద్ మరణించిన నేపథ్యంలో, బడ్జెట్ ను ఈ రోజు ప్రవేశ పెట్టకూడదంటూ విపక్షాలు అడ్డుపడుతున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. లోక్ సభలో కాకపోయినా, కనీసం రాజ్యసభలో అయినా ఎట్టి పరిస్థితుల్లోనైనా బడ్జెట్ ను ప్రవేశపెట్టాలని తొలుత భావించిన ఎన్డీయే ప్రభుత్వం... ఆ తర్వాత రూటు మార్చింది. లోక్ సభలో అహ్మద్ మృతికి సంతాపం ప్రకటించిన వెంటనే... కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కేంద్ర బడ్జెట్ ను లోక్ సభలో ప్రవేశపెట్టారు. ప్రస్తుతం ఆయన బడ్జెట్ ప్రసంగాన్ని చదువుతున్నారు. బడ్జెట్ ను జైట్లీ ప్రవేశపెడుతుండటం ఇది నాలుగోసారి. 

  • Loading...

More Telugu News