: కనీస గౌరవం ఇవ్వరా? సభను వాయిదా వేయండి: లోక్ సభలో ఖర్గే మండిపాటు
లోక్ సభలో సభ్యుడు అపస్మారక స్థితిలోకి వెళ్లి, చికిత్స పొందుతూ మరణిస్తే, కనీస గౌరవం కూడా ఇవ్వకుండా, బడ్జెట్ ను ప్రవేశపెట్టడం ఏంటని కాంగ్రెస్ మండిపడింది. ఈ ఉదయం ఎంపీ అహ్మద్ మృతి పట్ల సభ సంతాపం తెలిపిన అనంతరం, బడ్జెట్ ను ప్రతిపాదించేందుకు అరుణ్ జైట్లీకి స్పీకర్ అనుమతించిన వేళ, కాంగ్రెస్ సహా పలు విపక్ష పార్టీలు అడ్డుకున్నాయి. కాంగ్రెస్ సభాపక్ష నేత మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ, సభ్యుడి మృతికి కనీస గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత ఉందని, సభను నేటికి వాయిదా వేసి, రేపు బడ్జెట్ ప్రవేశపెడితే, నష్టం ఏంటని ప్రశ్నించారు. అందుకు అంగీకరించని స్పీకర్, ఆయన మృతిని వివాదం చేయవద్దని చెబుతూ, బడ్జెట్ ఎంతో ముఖ్యమైన అంశమని అన్నారు. ఆపై జైట్లీ తన ప్రసంగాన్ని ప్రారంభించారు.