: 'గౌతమీపుత్ర శాతకర్ణి' కలెక్షన్ల గురించి స్పందించిన బాలయ్య!


సంక్రాంతి సందర్భంగా టాలీవుడ్ సినీ దిగ్గజాలు చిరంజీవి, బాలకృష్ణల సినిమాలు విడుదలై అభిమానులను అలరించాయి. రెండు సినిమాలూ కాసుల వర్షం కురిపించాయి. 'ఖైదీ నంబర్ 150' సినిమా వసూళ్ల గురించి అల్లు అరవింద్ ప్రెస్ మీట్ పెట్టి వివరాలను వెల్లడించారు. అయితే, 'గౌతమీపుత్ర శాతకర్ణి' ఏ రేంజ్ లో వసూళ్లను సాధించిందో ఇంతవరకు బయటకు రాలేదు. ఈ సినిమా నిర్మాతలు కానీ, దర్శకుడు కానీ కలెక్షన్స్ గురించి ఎప్పుడూ మాట్లాడలేదు. తాజాగా దీనిపై బాలయ్య స్పందించారు.

సంక్రాంతికి విడుదలైన సినిమాల్లో ఏది ఎక్కువ వసూళ్లు సాధించిందో అందరికీ తెలుసని బాలయ్య అన్నారు. తనకు కలెక్షన్ల గురించి, నంబర్ల గురించి పెద్దగా ఆసక్తి ఉండదని చెప్పారు. అయితే, తన సినిమాను ఏ రేంజ్ లో ఉంచాలో తన అభిమానులకు తెలుసని అన్నారు. తనకు కలెక్షన్ల కన్నా అభిమానులే ముఖ్యమని చెప్పారు. 'గౌతమీపుత్ర శాతకర్ణి' సినిమా అఖండ విజయం నేపథ్యంలో టి.సుబ్బరామిరెడ్డి ఓ గ్రాండ్ పార్టీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ, పైవ్యాఖ్యలు చేశారు.  

  • Loading...

More Telugu News