: విజయకాంత్‌పై దాఖలైన పరువునష్టం కేసు వాయిదా.. ఏప్రిల్ 3న విచారణ
తమిళ నటుడు, డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్‌పై దాఖలైన పరువు నష్టం కేసు విచారణ ఏప్రిల్ 3వ తేదీకి వాయిదా పడింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని కించపరిచేలా మాట్లాడారని ఆరోపిస్తూ ప్రభుత్వ అధికారులు ఆయనపై పరువు నష్టం కేసు వేశారు. ఆగస్టు 10, 2012న తంజావూరులో రైతులకు సహాయాన్ని అందజేసిన విజయకాంత్ ప్రభుత్వాన్ని, సీఎంను తీవ్రస్థాయిలో కించపరిచినట్టు అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసును విచారణకు స్వీకరించిన తంజావూరు కోర్టు ఏప్రిల్ 3కు వాయిదా వేసింది. అలాగే డీఎండీకే నేతలు పార్థసారథి, జయకుమార్‌లపై దాఖలైన మరో పరువు నష్టం కేసును మార్చి 23కు కోర్టు వాయిదా వేసింది.