: గుండెపోటుకు గురైన ఎంపీ అహ్మద్ కన్నుమూత.. చికిత్స పొందుతూ ఈ తెల్లవారుజామున మృతి
పార్లమెంటులో మంగళవారం రాష్ట్రపతి ప్రసంగిస్తున్న సమయంలో గుండెపోటుకు గురై సభలోనే కుప్పకూలిన మాజీ మంత్రి, ఐయూఎంఎల్ ఎంపీ ఇ.అహ్మద్(78) ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. ఢిల్లీలోని రామ్‌మనోహర్ లోహియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఈ తెల్లవారుజామున మృతి చెందారు. మంగళవారం రాష్ట్రపతి ప్రణబ్ ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడుతున్న సమయంలో వెనుక వరుసలో కూర్చున్న అహ్మద్ ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. స్పృహతప్పి పడిపోయిన ఎంపీకి రాష్ట్రపతి వైద్య బృందం ప్రాథమిక చికిత్స అందించి ఆస్పత్రికి తరలించింది. అక్కడ చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు. మన్మోహన్‌సింగ్ ప్రభుత్వ హాయంలో అహ్మద్ విదేశాంగ, రైల్వేశాఖ సహాయమంత్రిగా పని చేశారు.