: బ్రేకింగ్....పంజాబ్ కాంగ్రెస్ ర్యాలీలో బాంబు పేలుడు
పంజాబ్ లోని కాంగ్రెస్ ర్యాలీలో అపశ్రుతి చోటుచేసుకుంది. ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో భటిండా జిల్లాలోని మౌర్ నియోజకవర్గంలోని కాంగ్రెస్ అభ్యర్థి హర్మీందర్ ర్యాలీ నిర్వహించారు. పొద్దుపోయిన తరువాత జరిగిన ఈ ర్యాలీలో ఒక్కసారిగా బాంబు పేలుడు సంభవించింది. కారులో బాంబు పేలుడు జరగడం కలకలం రేపుతోంది. ఈ పేలుడు ధాటికి ర్యాలీలో పాల్గొన్న ముగ్గురు మరణించారు. కాంగ్రెస్ అభ్యర్థి హర్మీందర్ కు ఎలాంటి ప్రమాదం జరగలేదు. పలువురు గాయపడ్డారు. దీంతో రంగప్రవేశం చేసిన పోలీసులు, కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.