: రెండో టీ20లో కనుక ఓడి ఉంటే, అంతా ఏమనేవారో నాకు తెలుసు!: నెహ్రా


రెండో టీ20లో టీమిండియా ఓటమిపాలై ఉంటే ఏమనేవారో తనకు తెలుసని స్టార్ పేసర్ ఆశిష్ నెహ్రా వ్యాఖ్యానించాడు. జట్టులో అందరికంటే సీనియర్ అయిన ఆశిష్ నెహ్రా (37) ను కామెంటేటర్లు కూడా నెహ్రాజీ అంటూ సంబోధిస్తారు. అలాంటప్పుడు ఓటమిపాలైతే... జట్టులో ఇంకా నెహ్రా అవసరమా? అని అంతా కామెంట్ చేస్తారని అన్నాడు. అందరూ తన వయసును చూస్తారని, అయితే తన వరకు వయసు అంటే కేవలం అంకెలేనని అన్నాడు.

ఏడు నెలల విరామం తరువాత జట్టులో పునఃప్రవేశం చేశానని, వర్థమాన ఆటగాళ్లను తీసుకోకుండా నెహ్రాను ఇంకా ఎందుకు ఆడిస్తున్నారని అంతా తమ వేలును తమ వైపే చూపించేవారని అన్నాడు. తాను ఆడగలిగినంతకాలం ఆడతానని చెప్పాడు. ఇన్నాళ్ల గ్యాప్ తరువాత భారత జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నా ప్రాక్టీస్ లోపం కనిపించలేదని చెప్పాడు. ఒక్క మ్యాచ్ ఆడినా గాడినపడగలనని నెహ్రా తెలిపాడు. దానికి అనుభవం సహకరిస్తుందని అన్నాడు. తాను మ్యాచ్ ఆరంభంలో, చివర్లో బౌలింగ్ చేస్తుంటానని, దీంతో ఫిట్ గా ఉండడం ఎంత ముఖ్యమో తనకు తెలుసని నెహ్రా పేర్కొన్నాడు. 

  • Loading...

More Telugu News