: ‘గన్’లా కనిపిస్తున్న ఏపీ మ్యాప్ అంటే ఇష్టం: రామ్ గోపాల్ వర్మ
తనదైన శైలిలో విమర్శలు, ప్రశంసలు చేసే ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దృష్టి ఈ సారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై పడింది. డిస్ట్రిక్ట్ మ్యాప్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పేరిట ఒక మ్యాప్ ను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన వర్మ, ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘గన్’ లా కనిపిస్తున్న ఆంధ్రప్రదేశ్ మ్యాప్ ను తాను ఇష్టపడుతున్నానని ఆ ట్వీట్ లో వర్మ తన అభిప్రాయం వ్యక్తం చేశారు.