: ఇక్కడ ఇళ్లున్నాయి, ఆస్తులున్నాయి... మేమేం చేయాలి?: ఎన్నారైల ఆందోళన


అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు చాలా సమస్యలకు కారణమవుతాయని అమెరికాలో నివాసముంటున్న సురేష్ అనే ఎన్నారై తెలిపారు. ఓ టీవీ ఛానెల్ తో ఆయన మాట్లాడుతూ, అమెరికాలో చోటుచేసుకుంటున్న పరిణామాలు భారత్ ఐటీ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతాయని అన్నారు. హెచ్1బి వీసాలపై భారత్ నుంచి అమెరికాకు వచ్చినవారు ఇళ్లు, ఆస్తులు వంటివి సమకూర్చుకున్నారని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో అమెరికాలో ఉద్యోగం చేస్తున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగులపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుందని అన్నారు.

ట్రంప్ ప్రవేశపెట్టిన బిల్లు 80 శాతం ఆమోదం పొందుతుందని ఆయన చెప్పారు. అలాంటప్పుడు ట్రంప్ ఎక్కువ సమయం కూడా ఇవ్వరని, ఆయన అనుకున్నది అతి త్వరలో అమలు చేయాలని ఆదేశాలు ఇస్తారని, అలాంటప్పుడు అమెరికాలో స్థిరపడ్డ భారతీయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన చెప్పారు. ఉన్నపళంగా ఆస్తులు అమ్ముకుని భారత్ ఎంతమంది రాగలరు? అమ్ముకోలేని వారి ఆస్తుల పరిస్థితి ఏంటి? ఆయా కంపెనీలు భారత్ లో ఉద్యోగ అవకాశం ఇస్తాయా? అలా ఇస్తే భారత్ లో ఆఫ్ షోర్ ఉద్యోగాలు పెరుగుతాయి, అలా ఇవ్వని పక్షంలో భారతీయులు ఇబ్బందులు పడే అవకాశం ఉందని ఆయన తెలిపారు. అమెరికాలో స్కిల్డ్ పీపుల్ ఉద్యోగాల్లో స్థిరపడిపోయారని ఆయన పేర్కొన్నారు. 

  • Loading...

More Telugu News