: ఉత్తరప్రదేశ్ మరో కశ్మీర్ గా మారుతోంది... హిందువులను వెళ్లగొడుతున్నారు: బీజేపీ ఎంపీ ఆదిత్యనాథ్


ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ నేతల విమర్శలు, ఆరోపణల్లో పదును పెరుగుతోంది. తాజగా బీజేపీ ఎంపీ యోగి ఆదిత్య నాథ్ ఉత్తరప్రదేశ్ మరో కశ్మీర్‌గా మారుతోందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. లక్నోలో ఆయన మాట్లాడుతూ, కశ్మీర్ నుంచి పండిట్లను తరిమినట్లు, పశ్చిమ యూపీలోని వివిధ ప్రాంతాల నుంచి హిందువులను బలవంతంగా వెళ్లగొడుతున్నారని ఆరోపించారు. హిందువులను రక్షించడంలో అధికార ఎస్పీ, ప్రతిపక్ష బీఎస్పీ పార్టీలు పూర్తిగా విఫలమయ్యాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్ కు రక్షణగా బీజేపీ నిలుస్తుందని ఆయన అన్నారు. 

  • Loading...

More Telugu News